శ్రీచైతన్యమహాప్రభువు జీవితచరిత్ర మరియు ఉపదేశములు ( Sri Chaitanya Mahaprabhu Jivitacharitra Mariyu Upadeshamlu (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
అనేక యుగాలలో పలు అవతారాలు (దివ్యులైన ఆచార్యులు, భగవదవతారాలు) ఈ జగత్తులో ఆవిర్భవిం చినా స్వర్ణావతారుడైన శ్రీచైతన్యమహాప్రభువు యథేచ్ఛగా పంచినట్లు ఆధ్యాత్మిక ప్రేమను ఎవ్వరూ పంచలేదు. శ్రీచైతన్యమహాప్రభువు (మహాప్రభువు అంటే ఘనుడైన ప్రభువని అర్థము) క్రీ.శ. 1486లో బెంగాలు నందు జన్మిం చారు. ఆయన కేవలము 48 సంవత్సరాలే ఈ భూమిపై ఉన్నప్పటికీ కోట్లకొలది జనుల జీవితాలను ప్రభావితము చేసే ఆధ్యాత్మికోద్యమాన్ని ప్రారంభించారు. యౌవనములోనే గొప్ప భక్తునిగా పేరు పొందిన శ్రీచైతన్యులు 24వ ఏటనే గృహస్థ జీవితాన్ని త్యజించి పురాతన వేదజ్ఞానాన్ని భారతదేశమంతటా ఉపదేశించారు. స్వయంగా తాను సన్న్యాసియైనా ఆయన ఏ విధంగా మనిషి ఇంటిలో, వృత్తిలో,సాం ఘిక వ్యవహారాలలో ఆధ్యాత్మిక చైతన్యం తో వర్తిం చవచ్చునో బోధించారు. ఈ విధంగా కాలాతీతమైన ఆయన బోధలు నేటి ప్రపంచానికి ప్రత్యేకంగా సంగతమై ఉన్నాయి. విశుద్ధ భగవత్ప్రేమ పారవశ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిం చగలిగే ఆచరణీయమైన పద్ధతిని ఆయన ఉపదేశించారు. ఈ పుస్తకము శ్రీచైతన్యమహాప్రభువులవారి అసాధారణమైన జీవితాన్ని గురిం చి తెలియజేస్తూ ఆయన ఉపదేశ సారాన్ని వివరిస్తుంది.
Product Details
- No Of Pages: 88
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-93-88883-21-4
- Product Size: 18 x 12 x 0.4 (cms)
- Weight: 0.08 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.