పంచ మహా ఆచార్యుల కథలు ( Panchamaha Acharyalu Kathalu (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
భూమిపై ఉండే అన్ని నగరాలలో, గ్రామాలలో హరినామము ప్రచారము కాబోతున్నదని శ్రీచైతన్యమహాప్రభువు ఐదువందల సంవత్సరాల క్రిందట భవిష్యద్వాణి పలికారు. ఆ దివ్యవాణిని గడచిన రెండు వందల సంవత్సరాల కాలంలో ఐదుగురు మహా ఆచార్యులు సత్యం చేసి చూపించారు. ఆ ఐదుగురు మహా ఆచార్యులే శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు, శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు, శ్రీల గౌరకిశోరదాస బాబాజీ మహారాజు, శ్రీల భక్తివినోద ఠాకూరులు, శ్రీల జగన్నాథదాస బాబాజీ మహారాజు. ఈ ఐదుగురు మహా ఆచార్యుల అద్భుతమైన జీవితచరిత్రను మీ అందరికీ పరిచయము చేసేదే ఈ “పంచ మహాఆచార్యుల కథలు’’ పుస్తకము. శ్రీచైతన్యమహాప్రభువు పలికిన భవిష్యద్వాణి దాదాపు మూడు వందల సంవత్సరాల వరకు అసాధ్యమైనదిగా కనిపించినప్పటికీ ఆ తరువాత రెండు వందల ఏళ్ళ సమయంలో కృష్ణశక్తితో నిండినట్టి ఐదుగురు మహా ఆచార్యులు పరమాద్భుతంగా హరినామాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టి అన్ని నగరాలలోను, గ్రామాలలోను పంచి జగత్తును మంగళమయంగా చేసారు. కలియుగంలో హరినామసంకీర్తనము ఒక్కటే యుగధర్మమని, సమస్త అభీష్టాలను ఈడేర్చే ఉపాయమని శాస్త్రాలలో చెప్పబడిన పరమ రహస్యాన్ని ఏ విధంగా ఐదుగురు మహా ఆచార్యులు ఒకరి తరువాత ఒకరిగా నిష్ఠతో, మానవుల పట్ల పరమ కరుణతో, దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని పట్ల అనన్యమైన భక్తితో ప్రపంచమంతటా ప్రచారం చేసారో ఈ పుస్తకము పూర్తిగా తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టి వందలాది ఇస్కాన్ మందిరాలలోని ప్రతీ గర్భగుడిలోను భగవంతునితో పాటుగా దర్శనమిచ్చే ఈ ఐదుగురు మహాఆచార్యుల చరిత్ర వారి మహిమలను, కాలాతీతంగా నిలిచిపోయేవారి ప్రభావాన్ని మనకు తెలియజేస్తుంది మరియు మీకు పరమ శ్రేయస్సును, పరమ మంగళాన్ని, పరమవిజయాన్ని చేకూరుస్తుంది. వారి ఆశీస్సులతో అపారమైన ఆధ్యాత్మిక సంపత్తిని పొందినవారై మీ జన్మను సఫలం చేసికోండి. విజయోస్తు !
Product Details
- No Of Pages: 352
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-93-83430-10-9
- Product Size: 21 x 12.5 x 1.5 (cms)
- Weight: 0.266 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.